Sunday, July 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంక్యాన్సర్‌ బాధితురాలికి ఎల్‌వోసీ చేయూత

క్యాన్సర్‌ బాధితురాలికి ఎల్‌వోసీ చేయూత

- Advertisement -

భట్టి విక్రమార్కకు ఆమె భర్త రామకృష్ణ కృతజ్ఞతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న ‘మంత్రుల ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా కొద్దినెలల క్రితం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రామకృష్ణ చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించారు. తన భార్య క్యాన్సర్‌ లంప్‌తో బాధపడుతున్నారనీ, ఆమె వైద్యానికి ఆర్థిక సాయం చేయాలంటూ రామకృష్ణ చేసిన వినతికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించి ఆమెకు ఎల్‌వోసి అందజేశారు. దీంతో రామకష్ణ తన భార్యకు ఐదుసార్లు కీమో థెరపీ చేయించగలిగారు. చికిత్స అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె క్యాన్సర్‌ మహమ్మారి నుంచి పూర్తిగా విముక్తి పొందారని వైద్యులు నిర్ధారించారు. దీంతో భర్త రామకృష్ణ శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో తన కుటుంబం నిలబడిందంటూ ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. క్యాన్సర్‌ను విజయవంతంగా జయించినందుకు ఆ కుటుంబానికి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉండగా రామకృష్ణ హైదరాబాద్‌లో మెడికల్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన భార్యను ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కొంతకాలం చికిత్స పొందిన తర్వాత వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి ఆ కుటుంబానికి ఏర్పడింది. ఆ సమయంలో గాంధీభవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం వెంటనే స్పందించి ఆమెకు ఎల్‌వోసీ ఇచ్చారు. అంతేకాకుండా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. చికిత్స పొందుతున్న ఆమె యోగక్షేమాలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -