నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని 28వ వార్డుకు చెందిన అబ్దుల్ సోఫియాన్ కు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కృషితో ఐదు లక్షల ఎల్ఓసిని అందజేసినట్టు బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సమస్యలు వచ్చిన ప్రజలు తమ దృష్టికి తేవాలన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడమే ఎమ్మెల్యే లక్ష్యం పట్టణంలోని 36 వార్డులకు సంబంధించినటువంటి ఏ సమస్య అయినా మాకు తెలియజేస్తే వెంటనే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆకుల శీను, జాగీర్ధార్ శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శులు తిరుపతి నాయక్, ఖాందేష్ ప్రశాంత్, ఉపాధ్యక్షులు దొండి ప్రకాష్, చిన్న రెడ్డి, కార్యదర్శులు కుమార్, ప్రసన్న గౌడ్, గోపికృష్ణ, తదితరులున్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



