- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన కండ్లి పోసాని వైద్యం కోసం ప్రభుత్వం రూ.2లక్షల ఎల్ఓసి మంజూరు చేసింది. కండ్లి పోసాని కాలికి సంబంధించిన ఆపరేషన్ కొరకు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరారు. వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను సంప్రదించారు. ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించారు. అట్టి రూ.2లక్షల ఎల్ఓసి మంజూరు పత్రాన్ని బాధితురాలు కుమారునికి శనివారం అందజేశారు.ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధితురాలి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



