నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పుర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన బుట్టి మల్లయ్య ఆపరేషన్ కోసం ప్రభుత్వం నుండి మంజూరైన రూ.2లక్షల ఎల్ఓసి పత్రాన్ని ఆదివారం అందజేశారు. కొద్ది రోజుల క్రితం బుట్టి మల్లయ్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఈఆర్ సిపి స్టెంటింగ్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో వారి కుటుంబం వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన ఆపరేషన్ కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.రెండు లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించారు. అట్టి ఎల్ఓసి మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.రూ.2లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించి, ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు బుట్టి మల్లయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆపరేషన్ కోసం రూ.2లక్షల ఎల్ఓసి అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES