Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత..

బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మండలంలోని మంథని గ్రామానికి చెందిన డ్యాగల భువనేశ్వర్ గుండె జబ్బుతో బాధపడుతున్నారు. సర్జరీ కోసం నిమ్స్ లో ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆపరేషన్ కు మరింత డబ్బులు అవసరమని డాక్టర్లు తెలిపారు. దీంతో వారు నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డిని కలిసి, వారి గోడును వివరించారు. వెంటనే స్పందించిన ఆయన శనివారం సీఎం సహాయ నిధి నుంచి ఎల్ఓసి ద్వారా రూ. 2లక్షల 50 వేలను బాధితుని భార్య సువర్ణకు హైదరాబాదులోని జూబ్లీహిల్స్  కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా ఆయనకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -