Wednesday, July 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుత్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి సీతక్క

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి సీతక్క

- Advertisement -

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క
నవతెలంగాణ – భిక్కనూర్

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదని, పంచాయతీ కార్యదర్శుల పైనే పని భారం పెరిగిపోయిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే స్థానిక సంస్థలను నిర్వహించడం జరుగుతుందన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఖజానా సరిపోతుందన్నారు.

నిధుల కొరత, అప్పుల భారం కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ఎన్ని ఇబ్బందులు అయినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. దీని కొరకు కమిటీని వేసి నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఒకపక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. బిల్లులు రాగానే డ్వాక్రా గ్రూపులో రుణాలు చెల్లించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా నాయకులు లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -