• పెద్దపల్లి డిసిపి కరుణాకర్
నవతెలంగాణ రామగిరి
స్థానిక ఎన్నికలలో “ఎన్నికల కోడ్” అమలైందని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. మంగళవారం రామగిరి మండల కేంద్రంలోని సెంటినరీ కాలనీలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఆయన పోలీస్ అధికారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమలు అవుతున్న దృష్ట్యా పోలీసులు నిఘా పెంచాలని సూచించారు. రూ.50 వేలకు మించి డబ్బులు ఎవరైనా వెంట తీసుకెళ్లవద్దని కోరారు. అదేవిధంగా మద్యం బాటిళ్లు కూడా పరిధికి మించి ఉండరాదని తెలిపారు. చట్టాన్ని ఎవరైనా చేతులలోకి తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మంథని సిఐ బి.రాజు, టూ టౌన్ సిఐ నక్క ప్రసాద్ రావు, రామగిరి ఎస్పై టి.శ్రీనివాస్, మంథని ఎస్సై రమేష్, ముత్తారం ఎస్ఐ ఎన్.రవికుమార్, కమాన్ పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ లు పాల్గొన్నారు.