ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే సోషల్‌మీడియాలో బీఆర్‌ఎస్ అసత్యప్రచారం : పంచాయతీరాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ-వైరా
42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు గ్రీన్ సిగల్ వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ రాజశేఖర్‌నగర్‌లో నివాసం ఉంటున్న తన అనుచరుడు చెరుకూరి కిరణ్ ఇంటికి ఆమె గురువారం వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంటుందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేపిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, చెరుకూరి కిరణ్, సూర్యదేవర శ్రీధర్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీసీ బిల్లుకు గ్రీన్‌సిగల్ రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES