- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గ్రామాల్లో సర్పంచ్ ల కాలం ముగిసి 20 నెలలు గడుస్తుందని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కలిపిస్తామనే సాకుతో స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా కాలయాపన చేస్తుందన్నారు. సర్పంచులు ఎంపీటీసీలు లేక గ్రామాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయన్నారు. నిధులు లేక గ్రామాల్లో తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్లడానికి ట్రాక్టర్లు వారానికి ఒకసారి వార్డుల్లో తిరగడం లేదన్నారు. గ్రామాలలోని సమస్యలు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఎలక్షన్లునిర్వహించాలని కోరారు.
- Advertisement -