Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి..

స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగిందిని ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ ఉమాదేవి అన్నారు. మంగళవారం  మండల కేంద్రం లోని మళ్ళీ ఖార్జున పంక్షన్ హాల్లో మంగళవారంగ్రామ పంచాయతీ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ  ఎన్నికల ప్రిసైడింగ్  అదికారులకు,  అసిస్టెంట్ ప్రెసిడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ  కార్యక్రమంలో మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిందని ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించనున్నదని తెలిపారు. తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగు తాయని ఆ తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిండం జరుగుతుంని తెలిపారు.  అక్టోబర్‌ 9 నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ , అక్టోబర్‌ 17 నుంచి సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెపారు.

సర్పంచ్ ఎన్నికలకు, జడ్పీటీసీ ఎంపీటీసీ  ఎన్నికలప్రి సిడింగ్  అదికారులకు, అసిస్టెంట్ ప్రెసిడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ శిక్షణలో భాగంగా బ్యాలెట్ బాక్స్ లని ఉపయోగించి ఏ విధంగా ఎన్నిక నిర్వహించాలి, బ్యాలెట్ పేపర్ నిర్వహణ ఎలా చేయాలి, ఎన్నికలు సందర్భంలో ఏ మెటీరియల్ ని ఎలా ఉపయోగించాలి, టెండర్ ఓటు కూడా రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, కౌంటింగ్ ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మా స్టర్ ట్రైనర్లు ఇరుమాది పాపిరెడ్డి, మేదర్ దేవేందర్,లు శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఎమ్మార్వో  శాంతి లాల్మండల విద్యాధికారి తరి రాము, ఎంపీఓ వివిధ డిపార్ట్మెంట్ల నుంచి పీఓ గా నియామకం కాబడిన అధికారులు హాజరైనారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -