నవతెలంగాణ – జన్నారం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మున్నూరు కాపు సంఘం జన్నారం పట్టణ అధ్యక్షుడు లెక్కల మల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పత్రికా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీసీ సంఘాలు తలపెట్టిన బందుకు మున్నూరు కాపు సంఘం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షులు కస్తూరి భూమన్న, అధ్యక్షులు లెక్కల మల్లయ్య, ఉపాధ్యక్షులు బొడ్డు రామన్న, భూతం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అప్పాల జలపతి, కోశాధికారి పూదరి నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి గోపి సత్యనారాయణ, ముఖ్య సలహాదారు నీరటి నర్సయ్య, కృష్ణవేణి స్కూల్స్ అధినేత కస్తూరి సతీష్, మండల ప్రచార కార్యదర్శి మారుతి సతీష్, పట్టణ సహాయ కార్యదర్శి అన్నము నరసయ్య పాల్గొన్నారు.
బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES