నవతెలంగాణ- ఆత్మకూరు
అత్మకూర్ మండలంలో మూడో విడత స్థానిక ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనర్ సంత్ సంప్రీత్ సింగ్ మంగళవారం పర్యటించారు. గ్రామపంచాయతీ ఎన్నికల మూడవ దశ సందర్భంగా అత్మకూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్వయంగా పరిశీలించారు. మండల కేంద్రంలోని సెయింట్ రిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించి పోలీసు సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా డ్యూటీలో ఉన్న అధికారులకు తనదైన శైలిలో మార్గదర్శకాలు ఇచ్చి, ఎన్నికల సమయంలో చట్టవ్యవస్థ కాపాడడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపరాదని ఆదేశించారు.
ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్మకూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల బాధ్యతలపై ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏఎస్పీ (డబ్ల్యూఆర్ఎల్) సుభమ్ ప్రసాద్ ఐపీఎస్ ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. గ్రామపంచాయతీ ఎన్నికల శాంతియుతంగా నిర్వహణ కోసం ఎన్నికల సమయంలో చేయవలసినవి, చేయరానివి అనే అంశాలపై సిబ్బందికి వివరంగా సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



