- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ZPTC, MPTC ఎన్నికల దృష్ట్యా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు, సంబంధిత అంశాలపై వివరాల కోసం 9240021456 నెంబర్‌ను సంప్రదించాలని ఈసీ అధికారులు వెల్లడించారు.
- Advertisement -