Tuesday, March 10, 2026
E-PAPER
Homeఖమ్మంబాల మేళాలో సత్తా చాటిన స్థానిక హైస్కూల్ విద్యార్ధులు

బాల మేళాలో సత్తా చాటిన స్థానిక హైస్కూల్ విద్యార్ధులు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
జిల్లాస్థాయి లో కొత్తగూడెంలో మంగళవారం జరిగిన ఎఫ్.ఎల్.ఎన్ బాల మేళాలో అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు తమ సత్తా చాటారు. హైస్కూల్ స్థాయి  లో జరిగిన పోటీలలో  కథా విభాగంలో 7 వ తరగతి చదువుతున్న రామ సత్యసాయి , నృత్య విభాగంలో 8 వ తరగతి చదువుతున్న చిన్నంశెట్టి హరిణి లు ద్వితీయ బహుమతులు సాధించారు. ఈ పోటీలో 23 మండలాల నుండి విద్యార్ధులు పాల్గొన్నారు.వీరిద్దరిని జిల్లా విద్యాశాఖ అధికారిణి బి. నాగలక్ష్మి ప్రశంసా పత్రము జ్ఞాపికలను అందించి సత్కరించారు.

భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని అన్నారు. తమ విద్యార్ధులు జిల్లాస్థాయిలో ప్రతిభను కనబర్చినందుకు ప్రధానోపాధ్యాయురాలు హరిత, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -