– వార్డు సభ్యుల పాలనావగహన లో టీఓటీ నార్లపాటి జగదీష్
నవతెలంగాణ – అశ్వారావుపేట
పారిశుద్ధ్యం మెరుగుదల, మంచినీటి సక్రమ సరఫరాతో స్థానిక సంస్థల కు గుర్తింపు, సర్పంచ్ లకు, సభ్యులకు ప్రజల మన్ననలు పొందవచ్చు అని టీఓటీ(ట్రైనీ ఆఫ్ ట్రైనర్) నార్లపాటి జగదీష్ అన్నారు. పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ లో రెండో రోజు మంగళవారం పాలకవర్గం బాధ్యతలు, స్థానిక అధికారుల విధులు, పారిశుద్ధ్యం నిర్వహణ పై అవగాహన కల్పించారు. పారిశుద్ధ్యం లో ప్రధానంగా తడి – పొడి చెత్త లు నిర్వహణ వాటితో ప్రత్యామ్నాయ పద్దతులతో పంచాయతీ కి ఆదాయం రాబట్టడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం ధ్యేయంగా ముందుకు సాగాలని కోరారు.ప్రజాప్రతినిధులకు అధికారాలు తో పాటు సామాజిక బాధ్యత లు ఉంటాయని వాటిని నెరవేర్చడానికి ప్రజా భాగస్వామ్యం అవసరం అని తెలిపారు. కార్యదర్శులు ప్రభుత్వానికి స్థానిక సంస్థల కు వారధులు గా పని చేస్తారని,అందరి సమన్వయం తోనే గ్రమం సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ లు కోటమర్తి శ్రీరామమూర్తి, కార్తీక్ లు పాల్గొన్నారు.
పారిశుద్ధ్యం మెరుగుపడితేనే స్థానిక సంస్థలకు గుర్తింపు
- Advertisement -
- Advertisement -



