Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంమంత్రి కొండా సురేఖని కలిసిన స్థానిక ఎమ్మెల్యే జారె

మంత్రి కొండా సురేఖని కలిసిన స్థానిక ఎమ్మెల్యే జారె

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణ ఎండోమెంట్,ఎన్విరాన్మెంట్,అటవీ అభివృద్ది మంత్రివర్యులు కొండా సురేఖ ని హైద్రాబాద్ తెలంగాణ సచివాలయంలోని  ఆమె ఛాంబర్లో బుధవారం స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో  దేవాదాయ (ఎండోమెంట్) శాఖ లో ఆలయాలు,ధార్మిక సంస్థలు,పరిరక్షణ,అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కొరకు ఆక్సిజన్ పార్క్(ఎకో పార్క్)ను ఆహ్లదాన్ని ఇచ్చే అర్బన్ పార్క్ గా త్వరలో అందుబాటులోకి తేవాలని అశ్వారావుపేట ప్రజలకు మరో పర్యాటక కేంద్రంగా మార్చాలని ఆమెను కోరారు. అలాగే తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ని వారి ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఆశ్రమ గిరిజన హైస్కూల్ (ఏజీహెచ్ఎస్ )లను ఇంటర్మీడియట్ (10+2) విద్య కి స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని ఇంటర్మీడియట్ విద్యకు అన్ని భౌతిక,మౌలిక ,సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ నాయక్ అడవత్ కు వివరించి,అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad