నవతెలంగాణ – మల్హర్ రావు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శనివారం రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి లు, వివిధ పార్టీల ముఖ్య లీడర్ల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు.
ఎంపిటిసిల రిజర్వేషన్లు ఇలా..
మండలంలో 15 గ్రామపంచాయతీల్లో 7 ఎంపిటిసిలు ఉండగా తాడిచెర్ల-1 (బిసి మహిళ),తాడిచెర్ల-2 (బిసి జనరల్), పెద్దతూoడ్ల (ఎస్టీ జనరల్), మల్లారం (ఎస్సి మహిళ) ,ఆన్ సాన్ పల్లి (బిసి జనరల్,రుద్రారం ఎస్సి జనరల్),వళ్లెంకుంట (జనరల్) స్థానాలకు కేటాయించారు.
సర్పంచ్ రిజర్వేషన్లు ఇలా…
తాడిచెర్ల (ఎస్సి మహిళ),మల్లారం (బిసి మహిళ),కొండంపేట (బిసి మహిళ),వళ్లెంకుంట (జనరల్ మహిళ), రుద్రారం (ఎస్సి జనరల్), అడ్వాలపల్లి (జనరల్ మహిళ), ఇప్పలపల్లి (జనరల్), నాచారం (బిసి మహిళ), ఆన్ సాన్ పల్లి (ఎస్టీ మహిళ), చిన్నతూండ్ల (జనరల్), మల్లంపల్లి (బిసి జనరల్),కొయ్యుర్ (ఎస్సి జనరల్),పెద్దతూoడ్ల (బిసి జనరల్),దుబ్బపేట (ఎస్టీ జనరల్),ఎడ్లపల్లి (బిసి జనరల్) ఖరారైయ్యాయి. వీటితోపాటు మండలంలోని 128 వార్డులు కూడా రిజర్వేషన్లు ప్రకటించినట్లుగా మండల ఇంచార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి తెలిపారు.