మున్సిపల్ ఎన్నికల్లో మా కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్, గ్రామపంచాయతీలాంటి స్థానిక సంస్థల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండబోదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు, అధికారంలో ఉన్నవారికే అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసిందని ఆరోపించారు. అదే విధంగా మా పార్టీ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో గట్టిగా కొట్లాడారని అన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వారికీ ఈ ఎన్నికలే సమాధానమని గుర్తు చేశారు. ఈ ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ అనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడిని తెచ్చి ప్రచారం చేసినా, ఆ పార్టీకి గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయని తెలిపారు. ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదన్నారు. నిన్నటి దాకా కలెక్టర్లు ఒక మాట, చీఫ్ సెక్రెటరీ ఒక మాట చెప్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలపై ఎవరికీ స్పష్టత లేదని తెలిపారు. ”ఫార్ములా అంశాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నది. ఇప్పటికే నాలుగు సార్లు విచారణ పేరుతో పిలిచి చేసిందేమీ లేదు. మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారు. ఎన్ని సార్లు విచారణ చేసినా మాకేమీ ఇబ్బంది లేదు” అని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాలుగు స్థానాలు మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు.
ఈసీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు
మున్సిపల్ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. శనివారం ఆపార్టీ జనరల్ సెక్రెటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని లీగల్ సెల్ బందం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం అందించింది. ఎన్నికల్లో నిబంధనలు పాటించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
స్థానిక ఫలితాల ప్రభావంఅసెంబ్లీ ఎన్నికలపై ఉండదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



