Saturday, September 13, 2025
E-PAPER
Homeకరీంనగర్శత్రుత్వాలను తొలగించుకోవడానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుంది

శత్రుత్వాలను తొలగించుకోవడానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుంది

- Advertisement -

జిల్లా న్యాయమూర్తి నీరజ
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఇరువురి మధ్య ఉన్న శత్రుత్వాలను తొలగించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జి నీరజ అన్నారు. సిరిసిల్లలోని న్యాయస్థానం ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ .. రాజీమార్గమే రాజా మార్గమని, ఏళ్ల నుంచి న్యాయస్థానంలోని ఉన్న కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఇరువురికి ఉందని న్యాయస్థానాల్లో ఉన్న కేసుల వల్ల కక్షిదారులు ఆర్థికంగా నష్టపోతారని అంతేకాకుండా ఇరువురి మధ్య పగద్వేషాలు పెరిగిపోతాయని అందరూ కలిసి ఉండడానికే లోక్ అదాలత్ ఉపయోగించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఇరువురి మధ్య ఉన్న కేసులను రాజీ కుదుర్చుకొని పరిష్కరించుకున్నట్లయితే భావితరాలు కలిసిమెలిసి ఉండే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్, న్యాయమూర్తి పుష్పలత, జిల్లా లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -