- Advertisement -
నవతెలంగాణ – న్యూఢిల్లీ: లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవాలని, ఆ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే డిమండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఎటువంటి జాప్యం చేయకుండా ఆ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 16వ లోక్‌సభ ప్రారంభం అయ్యే వరకు ప్రతి సభలోనూ డిప్యూటీ స్పీకర్ ఉన్నారని, ప్రతిపక్ష పార్టీల నుంచి డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవడం ఆనవాయితీ అని ఆయన ఆ లేఖలో తెలిపారు.
- Advertisement -