- Advertisement -
మనం అనుకున్నది సాధించాలంటే,
ఒంటరితనం మన బలంగా మారుతుంది.
మన వాళ్లు మన కళ్ల ముందు కనబడనప్పుడు,
ఒంటరితనం మన బలహీనతగా అనిపిస్తుంది.
మన గురించి మనం తెలుసుకోవాలంటే,
ఒంటరితనం మన మిత్రుడిగా మారుతుంది.
మన ప్రపంచం మనకు పరీక్షలు పెడుతుంటే,
ఒంటరితనం మనకు జీవిత పాఠాలు నేర్పుతుంది.
ప్రతి విషయంలో మంచి చెడు ఉన్నట్టే,
మంచిని గ్రహించగలిగితే,
ఒంటరితనం మనలో దాగి ఉన్న
అంతర్గత బలాన్ని వెలికితీస్తుంది.
కళ్యాణి పబ్బతి, 9985990709
- Advertisement -



