నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉద్యాన పంటలు సాగు చేయడం ద్వారా రైతుకు రొక్కం,దీర్ఘకాల,అదనపు ఆదాయం లభిస్తుంది అని స్థానిక ఉద్యాన పరిశోధనా స్థానం సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ విజయ క్రిష్ణ రైతులకు తెలిపారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కు చెందిన అశ్వారావుపేట ఉద్యాన పరిశోధనా స్థానం ఆద్వర్యంలో భారతీయ చిరుధాన్యాల సంస్థ – రాజేంద్రనగర్ సహకారంతో శనివారం ఎస్సీ రైతులకు వివిధ పండ్ల మొక్కలు అనగా మామిడి, జామ,సపోట,పనస మొక్కలను ఉచితంగా అందించడం జరిగింది. అదేవిధంగా ఉద్యాన పరిశోధనా నిపుణులతో ఒక రోజు ఉద్యాన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో అశ్వారావుపేట ఉద్యాన పరిశోధనా స్నానం సహా శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక,కేవీ కే కొత్తగూడెం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్, అగ్రికల్చర్ కాలేజ్ ప్రొఫెసర్లు డాక్టర్ కే.రవికుమార్, డాక్టర్ స్రవంతి,అశ్వారావుపేట వ్యవసాయ అధికారి శివరాం ప్రసాద్,వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. రవీంద్ర,ఉద్యాన విస్తరణ అధికారి ఈశ్వర్ లు పాల్గొని రైతులను పలు పంటల సాగు,యాజమాన్యం, మొక్కల సాగు,ఆయిల్ పామ్ లో అంతర పంటల సాగు, ఆయిల్ పామ్ మేలైన యాజమాన్యం,చీడ పీడల నివారణ, మునగ ఇతర బహు వార్షిక,కూరగాయ పంటల సాగు ప్రభుత్వ పధకాల గురించి వివరించారు.
