నవతెలంగాణ – జుక్కల్
గత కొన్ని ఎళ్లుగా లొంగన్ జీపీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ పుట్టినరోజు వేడుకలను జీపీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జుక్కల్ మండలంలోని ఎమ్మార్వో మారుతి, ఎంపీడీవో శ్రీనివాస్, ఆర్ఐ రామ్ పటేల్, ఎంపీ ఓ రాము, మండల స్థాయి నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. నిత్యం విధులకు తప్పకుండా హాజరవుతూ.. గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించేందుకు అనురాధ కృషి చేస్తోందని అన్నారున. అంకిత భావంతో పనిచేస్తోందని ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో మారుతి, ఆర్ఐ రామ్ పటేల్ ప్రశంసించారు. లొంగన్ గ్రామపంచాయతీ కార్యదర్శి పుట్టినరోజు వేడుకలో నాయకులు సొసైటీ చైర్మన్ శివానంద్, బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మాజీ జెడ్పిటిసి సాయా గౌడ్, నాగల గిద్దె చదువు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా లొంగన్ జీపీ సెక్రెటరీ పుట్టినరోజు వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES