నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లొంగన్ గ్రామంలో మండల పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు జీవాలకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు గ్రామ సర్పంచ్ నాగల దిద్దే ఉషారాణి సదు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారని జీపీ కార్యదర్శి అనురాధ తెలిపారు. ఈ సందర్భంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పశు సంపద ఎంతో అవసరమని తెలియజేశారు. పశువులు ఆరోగ్యం కూడా పశుపోషకులకు ఎంతో అవసరమని తెలియజేశారు. పశువుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు గ్రామాలలో పశువైద్యశాఖ అధికారులు వచ్చి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సదవకాశాన్ని గ్రామాలలోని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.



