నవతెలంగాణ – హైదరాబాద్ : డేవిడ్ మిల్లర్ బ్యాట్ పట్టి స్టేడియంలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లు బెదిరిపోతారు. అలాంటి విధ్వంసరక బ్యాట్స్‌మెన్ ఓ చిన్న తప్పు వల్ల టీమ్ ఒటమికి కారణమైంది. క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది. అప్పటి వరకు ఢిల్లీ ఫ్యాన్స్‌కు డేవిడ్ మిల్లర్ అంటే ఎంతో అభిమానం. ఈ అభిమానం ఒక్కసారిగా కోపానికి దారి తీసింది. నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. రెండు బాల్స్‌లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా మిల్లర్ చిన్న తప్పు చేశాడు. దీంతో ఒకే పరుగు తేడాతో గుజరాత్‌కు విజయం వరించింది.
అయితే.. తాను చేసిన తప్పుకు గ్రౌండ్‌లోనే డేవిడ్ మిల్లర్ ఎంతో కుమిలిపోయాడు. కన్నీరు సైతం పెట్టుకున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తన ఆఫీసియల్ ఎక్స్ హ్యాండిల్లో ఓ వీడియోను పంచుకుంది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో మిల్లర్ తీవ్ర భావోద్వేగానికి లోనయినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. తాను తీసుకున్న నిర్ణయం జట్టును ఓడించిందన్న బాధలో ఉన్న మిల్లర్‌ను కోచ్ హేమంగ్ బదానీ ఓదార్చుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



