Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeసినిమాయుద్ధ వీరుడుగా శ్రీ కృష్ణుడు

యుద్ధ వీరుడుగా శ్రీ కృష్ణుడు

- Advertisement -

అభయ్‌ చరణ్‌ ఫౌండేషన్‌, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను తాజాగా అనౌన్స్‌ చేశారు. ‘శ్రీ కష్ణ అవతార్‌ ఇన్‌ మహోబా’ పేరుతో అనిల్‌ వ్యాస్‌ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుండగా, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం ముకుంద్‌ పాండే వహిస్తున్నారు.
‘ఇస్కాన్‌- ఢిల్లీకి చెందిన సీనియర్‌ ప్రీచర్‌ జితామిత్ర ప్రభు శ్రీ ఆశీస్సులతో ఈ నవ్య కావ్యం రూపొందుతోంది. ఇది 11-12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కతిక వైభవాన్ని, అలాగే భగవాన్‌ శ్రీ కష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చుపించాబోతుంది. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇది. పాన్‌-వరల్డ్‌ ప్రాజెక్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. ప్రపంచస్థాయి టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, చరిత్ర, సాంస్కతిక వారసత్వం, ఆధ్యాత్మికతను కలగలుపుతుంది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad