– పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందజేసిన మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
– హాజరైన కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేశ్ బి గితే
నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో శుక్రవారం శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేశ్ బి గితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుమారు 50 వేల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా వేసి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
వేములవాడలో రాములోరి కళ్యాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



