నవతెలంగాణ – మల్హర్ రావు
లారీ, టిప్పర్ డ్రైవర్స్, క్లినర్స్ మస్టర్ వేతనాలు పెంచాలంటూ కాకతీయ టిప్పర్, డ్రైవర్స్, క్లినర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెతూ సమ్మయ్య, కార్యదర్శి సూరం సురేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు తాటిపాముల రాజబాబు ఆధ్వర్యంలో మండలంలోని నాగులమ్మ చౌరాస్తాలో మంగళవారం ఆందోళన చెపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ లో పెరిగిన నిత్యావసర సరుకులు, ఇంటి అద్దె, వైద్యం తదితర ఖర్చుల నేపథ్యంలో డ్రైవర్ కు రూ.వేలు, క్లినర్ కు రూ.1000 రోజువారీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ కు రూ.1,550, క్లినర్ కు రూ.600 వేతనాలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డ్రైవర్ కు సంవత్సరం బోనస్ పూర్తిగా చెల్లించాలని, ఒక రోజు ఓనర్ రూ.30 చొప్పున బోనస్ చెల్లించాలని, క్లినర్ రానిరోజు సగం వేతనం డ్రైవర్ కు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్, క్లినర్స్ పాల్గొన్నారు.
మస్టర్ వేతనాలు పెంచాలంటూ లారీ డ్రైవర్స్, క్లీనర్స్ ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



