Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్బ్రిడ్జిపై నుంచి లారీ బోల్తా

బ్రిడ్జిపై నుంచి లారీ బోల్తా

- Advertisement -

– డ్రైవర్‌ మృతి.. క్లీనర్‌కు తీవ్ర గాయాలు
నవతెలంగాణ-జహీరాబాద్‌

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ బైపాస్‌ రోడ్డు ప్రస్తాపూర్‌ ఓవర్‌ బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయం లారీ బోల్తా పడటంతో డ్రైవర్‌ రమేష్‌ (47) అక్కడికక్కడే మృతి చెందగా, క్లీనర్‌ వీరేశంకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ కాశీనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వెంచర్లలో ఉపయోగించే పైపుల లోడుతో హైదరాబాద్‌ నుంచి ముంబై వైపు వెళ్తున్న లారీ పస్తాపూర్‌ ఓవర్‌ బ్రిడ్జి వద్దకు రాగానే అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందకు పడింది. దాంతో డ్రైవర్‌కు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌, క్లీనర్‌ లారీలో ఇరుక్కుపోవడంతో జేసీబీల సహాయంతో బయటికి తీశారు. కాగా, క్లీనర్‌ వీరేశంకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో ప్రథమ చికిత్స నిర్వహించి, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. డ్రైవర్‌ నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణకు వచ్చినట్టు ఎస్‌ఐ తెలిపారు. లారీ యజమాని కడప నుంచి రావాల్సి ఉన్నందున కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad