Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెంట్రల్ లైటింగ్ పోల్ ను ఢీకొట్టిన లారీ

సెంట్రల్ లైటింగ్ పోల్ ను ఢీకొట్టిన లారీ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
కాటారం కేంద్రం (గారెపల్లి)లో శనివారం లారీ అదుపు తప్పి రోడ్డుమధ్యలో ఉన్న సెంట్రల్ లైటింగ్ పోల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనతో పోల్ కూలిపడి రోడ్డుపై పడగా, అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

లారీ వేగంగా వస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే స్థంభం కూలిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కూలిన స్థంభాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని స్థానికులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -