Friday, September 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలువాకింగ్ చేస్తున్న వ్యక్తులను ఢీకొట్టిన లారీ 

వాకింగ్ చేస్తున్న వ్యక్తులను ఢీకొట్టిన లారీ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉదయం వాకింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తుతెలియని లారీ వెనుక నుంచి ఢీకొని వెళ్లిపోయింది. స్థానికులు తెలిపిన విరాల ప్రకారం.. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వర్ పల్లి మేఘన ధాబా వద్ద శుక్రవారం ఉదయం వాకింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని లారీ ఢీకొట్టడంతో ఆ వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి.. వెంటనే గాయపడిన శివకుమార్ ను, భదవత్ సంజీవులు 108 అంబులెన్సులో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన బి శివకుమార్ ను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -