- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. SR పురం సమీపంలోని గ్రామాల నుండి స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకుని జీడీనెల్లూరు వైపు వెళ్తుండగా బీసీ కాలనీ వద్ద లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడగా.. ఓ విద్యార్థి నాలుక తెగిపోయినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



