Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆగి ఉన్న స్కూల్‌ బస్సును ఢీకొట్టిన లారీ

ఆగి ఉన్న స్కూల్‌ బస్సును ఢీకొట్టిన లారీ

- Advertisement -

9మంది విద్యార్థులకు గాయాలు
సిద్దిపేట జిల్లా ఇబ్రహీంనగర్‌లో ఘటన
నవతెలంగాణ-చిన్నకోడూరు

ఆగి ఉన్న స్కూలు బస్సును వెనుక నుంచి వచ్చిన సిమెంటు లోడ్‌ లారీ అతివేగంగా ఢీకొట్టింది. దాంతో తొమ్మిది మంది విద్యార్థులకు గాయలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటలోని రావూస్‌ పాఠశాలకు చెందిన బస్సు మండలంలోని ఆయా గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చే క్రమంలో ఇబ్రహీంనగర్‌ గ్రామంలో స్కూల్‌ పిల్లలు ఎక్కడానికి ఆగింది.

ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన సిమెంట్‌ లోడ్‌ లారీ బలంగా బస్సును ఢీకొన్నది. దాంతో బస్సులో ఉన్న తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనం ద్వారా సిద్ధిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా విద్యార్థులకు తీవ్ర గాయాలు కాకపోవడంతో.. పిల్లల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న చిన్నకోడూరు ఎస్‌ఐ చంద్రమోహన్‌ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -