- Advertisement -
– ఆంధ్రా వాసులు ఇరువురు మృతి
– దర్యాప్తు చేపట్టిన ఎస్.హెచ్.ఓ యయాతి రాజు
నవతెలంగాణ – అశ్వరావుపేట
ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా,జీలుగుమిల్లి మండలం, తాటి రామన్నగూడెం గూడెం కు చెందిన న మడకం సంతోష్,పండు సతీష్ లు ఆదివారం అశ్వారావుపేట మండలం చిచ్చొడిగుంపు లో జరిగిన ఒక శుభకార్యానికి హాజరై తిరిగి తమ గ్రామానికి ద్విచక్ర వాహనం పై వెళుతున్న క్రమంలో బచ్చువారిగూడెం దాటిన తర్వాత గాండ్లగూడం శివారు లో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇరువురు అక్కడికక్కడే మృతిచెందారు చెందారు. సమాచారం తెలుసుకున్న ఎస్.హెచ్.ఓ యయాతి రాజు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



