నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనగా వ్యక్తి మరణించగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జంగంపల్లి గ్రామానికి చెందిన పెద్ద నరసింహులు (50), భాస్కర్ ఇద్దరు ద్విచక్ర వాహనంపై గ్రామ శివారులో ఉన్న శ్రీకృష్ణ మందిర్ దర్శనానికి వెళ్లి తిరిగి జంగంపల్లి గ్రామానికి వస్తున్నారు. మందిరం సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొనగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. పెద్ద నరసింహులు చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఈ మేరకు అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ప్రమాదానికి గురైన లారీ, లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ..వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES