అతడిని జట్టు నుంచి తీసేస్తారు.. మళ్లీ అవకాశం ఇస్తారు… అయినా ఆడించరు…మళ్లీ అవకాశం ఇస్తారు…తనతో మ్యూజికల్ ఛైర్ ఆడుకున్నారు. ఎవరికైనా ఓ రోజు వస్తుందని ఎదురుచూశాడు. ఆరోజులు వచ్చాయి.. అంతే అతడు తన బ్యాట్ కు పని చెప్పాడు.. ఆటతోనే ఎందరికో సమాధానం చెప్పాడు…ఆ రోజున అతడిపై పూలవర్షం కురిసింది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అందుకు టీమిండియా విధ్వంసకర ఓపెనర్ సంజూ శాంసనే ఓ పెద్ద ఉదాహరణ. భారత జట్టుకు భారమని ఛీ కొట్టినోడే.. ఒంటి చేత్తో టీమిండియాను సెమీఫైనల్ నుంచి ఫైనల్ కు తీసుకెళ్లాడు. ఫైనల్ లో టీంమిండియూకు కప్ అందించి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అందుకున్నాడు. ఈ క్రమంలో తన సక్సెస్ వెనుక ఉన్న రహస్యాలను, తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికర సంఘటనలను సంజు పంచుకున్నాడు.
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కెరీర్ గత పదేళ్లుగా ఒడిదుడుకులతో సాగినా.. 2026 టీ20 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శనతో తనదైన ముద్ర వేశాడు. పదేండ్ల నిరీక్షణ తర్వాత జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. కీలక మ్యాచుల్లో అదరగొట్టి భారత్‌కు ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్, ఇషాన్, తిలక్, హార్దిక్, సూర్యకుమార్ యాదవ్ అందరూ కట్టకట్టుకొని విఫలమైన వేళ.. తానొక్కడే నిలబడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. రెండేండ్ల కిందట జరిగిన పొట్టి కప్‌ను గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడే. కానీ, అప్పుడు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. దానికి కారణం రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడమే. ఆ తర్వాత కూడా భారత జట్టులోకి వస్తూ వెళ్లాడు. ఈ వరల్డ్ కప్‌లోనూ అతడికి అవకాశం అనూహ్యంగా వచ్చింది. దానిని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. కేవలం ఐదు మ్యాచులు మాత్రమే ఆడిన సంజు 321 పరుగులు చేశాడు. సంజు సూపర్-8 మ్యాచ్‌లో విండీస్‌పై 97 నాటౌట్, ఇంగ్లాండ్‌పై 89 పరుగులు, ఫైనల్‌లో కివీస్‌పై 89 పరుగులు చేశాడు.అతనికి జీవితానికి సరిపోయే ఆట ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌ను యావత్ క్రికెట్ ప్రపంచం చాలా ఏండ్లు గుర్తుంచుకుంటుంది.

కొడుకు కోసం ఉద్యోగాన్ని వదిలేసిన తండ్రి
సంజుది కేరళలోని తిరునంతపురం జిల్లాలోని విళింజమ్ సమీపంలోని తీరప్రాంత గ్రామమైన పుల్లువిలా. తండ్రి శాంసన్ విశ్వనాథన్, తల్లి లిజీ విశ్వనాథ్. సంజు తండ్రి ఢిల్లీలో ఒక సాధారణ కానిస్టేబుల్. సంజుకు పుట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. మొదట ఫుట్‌బాల్ ప్లేయర్ అవ్వలనుకున్నాడు. ఫుట్‌బాల్ ప్లేయర్‌నైనా ఐపీఎస్ అధికారి కావాలనుకున్నాడు. కానీ నాన్న సూచనతో క్రికెట్ వైపు వచ్చాడు. ఢిల్లిలో తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన సంజు అండర్-13కి ఎంపిక కాకపోవడంతో నాన్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరికి మకాం మార్చేశాడు. ఆ మరుసటి ఏడాదే కేరళ అండర్-13 జట్టుకు ఎంపికయ్యడు. దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభ చూసి, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నన్ను తీసుకుంది. అప్పుడు ఆడే అవకాశం రాకపోయినా 2013లో రాజస్థాన్ రాయల్స్ తరపున తన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసాడు. ఆర్‌ఆర్ జట్టు తరుపున అడిన సంజు తన సంత్తా చాటడు. తన అడిన మొదటి ఐపీఎల్ టోర్నమెంట్ లోనే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ను గెలుచుకున్నాడు. దీంతో టీంమిడియాలో (2015) జింబాబ్వేతో టీ20 సీరిస్ లో మొదటిసారి భారత్ టీంలోకి వచ్చాడు. ఆ తార్వాత వడ్డే(2021) లోకి వచ్చాడు.
తన కంటే బరువుండే కిట్ బ్యాగ్‌తో
స్కూల్లో ఉన్నప్పుడు- తన కంటే బరువుండే కిట్ బ్యాగ్‌తో సూర్యోదయానికంటే ముందే ఇంటి నుంచి బయలుదేరే వాడు. రెండు బస్సులు మారి, ఆరింటికల్లా గ్రౌండ్‌కి వెళ్లేవాడు. ప్రాక్టీస్ తర్వాత గ్రౌండ్‌లోనే ఓ మూలన ఉండే పంపు కింద స్నానం చేసి, వెంట తెచ్చుకున్న యూనిఫాం వేసుకొని… అటునుంచి అటే స్కూల్‌కి వెళ్లేవాడు. అక్కడే హోంవర్క్ చేసేసుకొని, సాయంత్రం మళ్లీ ప్రాక్టీస్ చేశాకే ఇంటికెళ్లేవాడు.
గంభీర్ ప్రోసహం.. ద్రవిడ్ సూచనలు
వరుస వైఫల్యాలతో డ్రెస్సింగ్ రూమ్‌లో దిగాలుగా కూర్చున్న తరుణంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు ఇచ్చిన ధైర్యం చాలా గొప్పది. ‘వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నానని బాధపడుతుంటే గంభీర్ నా దగ్గరకు వచ్చారు. విషయం చెప్పాను. నువ్వు 21 సార్లు ఫెయిలైనా పర్లేదు, 22వ సారి కూడా నేనే నిన్ను బ్యాటింగ్‌కు పంపిస్తా. అవకాశాల గురించి చింతించకుండా నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడంపై దష్టి పెట్టు అని చెప్పారు. ఆ మాటలు నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి’ అని సంజు మీడియాతో పంచుకున్నాడు. ఐపీఎల్ ద్వారా ద్రవిడ్ తో కలిసి పని చేసే అవకాశం సంజుకు దక్కింది. ప్రతి విషయాన్నీ అతడ్ని అడిగి తెలుసుకొని అవన్నీ బుక్‌లో నోట్ చేసుకునేవాడు.

ఆమే నా బ్యాక్ బోన్
2018, సెప్టెంబరు 8న సంజుకు తన చిరకాల స్నేహితురాలు చారులత రమేష్‌తో వివాహం జరిగింది. వీరు మార్ ఇవానియోస్ కాలేజీకి చెందిన కాలేజ్ మేట్స్. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. కానీ, అది చెప్పే ధైర్యం లేక, ఒకరోజు ఫేస్‌బుక్‌లో మామూలుగా మెసేజ్ పెట్టాడు. అలా మాటల క్రమంలో తన మనసులోనూ నేనున్నానని అర్థమైంది. పెద్దలూ సరేననడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలంటూ వెన్నుతడుతూ సంజుకు బ్యాక్ బోన్ గా నిలిచింది. అందుకే టీ20 ఫైనల్ గెలవగానే మైదానంలోంచే వీడియోకాల్ చేసి నా సంతోషాన్ని తనతో పంచుకున్నాడు.
తాతే స్ఫూర్తి
”మా తాత జాలరి. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు ఒకరోజు చేపలు బాగా పడితే, ఇంకోరోజు పడేవి కాదు. అలాగని చేపలు పడనప్పుడు తన మీద తానెప్పుడూ నమ్మకం కోల్పోలేదు. నేనూ అదే పాటిస్తుంటా. నా పదేళ్ల కెరీర్‌లో ఫెయిల్యూర్లే ఎక్కువ. ఏదేమైనా నా సామర్థ్యంపైన నమ్మకం మాత్రం కోల్పోలేదు. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడంతో మొబైల్‌కూ, సోషల్ మీడియాకూ దూరంగా ఉన్నా. షాట్ల ఎంపికపైనే దష్టి పెట్టా–అందుకే ఆయనే నాకు నిరంతర స్ఫూర్తి అని చెబుతాడు సంజు.
కవిత్వం అంటే ఇష్టం:
కవిత్వం అంటే ఇష్టం. కాలేజీలో చేరిన కొత్తల్లో ఇంగ్లిష్ కవితల పుస్తకాలు చదివేవాడు. చిన్న చిన్న కవితలూ కూడా రాసేవాడు. తను చారులతతో ప్రేమలో ఉన్నప్పుడు ఆమెకు కవితాత్మక సందేశాలు పంపేవాడు. ఆమె నుంచి కూడా అదే స్టైల్ లో రిప్లే వచ్చేది. అలా ఈ క్రికెటర్ జీవితంలో కవిత్వం కూడా ఒక భాగమైపోయింది.
డి.ఎస్.పి సంజు శాంసన్
కేరళ రాష్ట్ర ప్రభుత్వం సంజుకు డి.ఎస్.పి జాబ్ ఇచ్చింది. టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత సంజును కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రత్యేకంగా అభినందించారు. టీమ్ ఇండియా గెలుపులో ముఖ్యపాత్ర పోషించావంటూ భుజం తట్టి అభినందించారు.
– కల్లూరి ఎలెందర్, 9100310115




