నవతెలంగాణ – మల్హర్ రావు (కాటారం): కాటారం మండలంలో పలు చోట్ల పోగొట్టుకున్న సెల్ఫోన్లను ఎస్సై-2 శ్రీనివాస్, ప్రొబేషనరీ ఎస్సై గీతారాథోడ్ ఆధ్వర్యంలో పోలీసులు రికవరీ చేసి తిరిగి బాధితులకు బుధవారం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే కాటారం మండలంలోని దామెరకుంటకు చెందిన వెంకటేశ్వర్లు, బస్వాపూర్ కు చెందిన కొమురయ్య, రేగులగూడెంకు చెందిన లక్ష్మికాంత్ ఇటీవల మండల పరిధిలో సెల్ఫోన్లను పోగొట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసిన పోలీసులు సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఈ మేరకు బాధితులకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సైలు సెల్ఫోన్ లను అప్పగించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
పోగొట్టుకున్న సెల్ ఫోన్ల అందజేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES