Monday, October 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ లో ప్రశాంతంగా లాటరీ ప్రక్రియ

ఆదిలాబాద్ లో ప్రశాంతంగా లాటరీ ప్రక్రియ

- Advertisement -

కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా పూర్తి
34 షాపులకు గాను టెండర్ పూర్తి
మిగతా ఆరు షాపులకు త్వరలో టెండర్
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్   

జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను సోమవారం స్థానిక రత్న గార్డెన్‌లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా పారదర్శకంగా నిర్వహించారు. ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కే. రఘు రామ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఎక్సైజ్ సీఐ విజేందర్, మద్యం దుకాణాల దరఖాస్తుదారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎక్సైజ్ పాలసీ (2025–2027) ప్రకారం మొత్తం 40 మద్యం షాపుల కేటాయింపులో, 34 షాపులు లక్కీ డ్రా ద్వారా కేటాయించబడ్డాయి. 10 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన షాపులకు డ్రా నిర్వహించకుండ, వాటి కోసం మళ్లీ రీ-టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

వీటిలో ఆదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని షాప్ నం. 16, 17, 18 తాంసి, తలమడుగు, భీంపూర్ షాపు లకు వాయిదా పడింది. అలాగే ఇచ్చోడ పరిధిలో షాప్ నం.25, 28 అడెగామ, సిరికొండ, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో షాప్ నం.40 లోకారికి లక్కీడ్రా వాయిదా వేశారు. లక్కీడ్రా కోసం వందల సంఖ్యలో టెండర్ దారులు, వారి సంబంధికులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. లక్కు దక్కిన వారు చలాన్ తీసేందుకు బ్యాంక్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. టెండర్ దారులకు పాస్ లు కేటాయించారు. పాస్ లు ఉన్నవారికే లోపలికి అనుమతించారు. సెల్ ఫోన్ లోనికి అనుమతించకుండా సెల్ ఫోన్ భద్రపరిచేందుకు కౌంటర్ ఏర్పాటు చేశారు. టెండర్ దారులు ఆసక్తిగా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. షాప్ దక్కినవారు ఆనందంలో మునిగిపోగా లక్కు కలిసిరాని వారు నిరాశ చెందారు.

ప్రతి షాపుకు సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా లక్కీ డ్రా నిర్వహించారు. డ్రా ప్రారంభం నుంచి ముగింపు వరకు మొత్తం ప్రక్రియను ఫోటో, వీడియో రికార్డింగ్ చేయడం ద్వారా పూర్తి పారదర్శకతతో నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భద్రతా పరమైన దృష్ట్యా భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో ఎంపికైన వారికి లైసెన్స్ ఫీజు చెల్లింపునకు అవసరమైన సదుపాయాలను వేదికపైనే కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -