Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుప్రేమ సహజమైన మానవ అవసరం

ప్రేమ సహజమైన మానవ అవసరం

- Advertisement -

– ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్
న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రేమ సహజమైన మానవ అవసరమని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. బాగా లింగం పల్లి మైనారిటీ గురుకుల్ స్కూల్ లో స్కూల్ హెచ్ ఎం వాణిశ్రీ, లయన్స్ క్లబ్ 320ఎ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10గంటలకు 9,10వతరగతి విద్యార్థులకు టీనేజ్ ప్రేమ – మానసిక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మనిషి పుట్టిన తరువాత ప్రేమ కోరుకోవడం సహజమని తెలిపారు. కానీ, టీనేజ్ వయస్సులోని ప్రేమ వేరన్నారు. ఆ వయసులో హార్మోనల్ మార్పులు, వ్యక్తిత్వ శోధన, కొత్త అనుభవాలు ఎక్కువ ప్రభావం చూపుతాయన్నారు. టీనేజ్ వయస్సు లో హార్మోన్లు మార్పు వల్ల “ఆకర్షణ” బలంగా పని చేస్తుందని చెప్పారు. నేను ఎవరు? “నా జీవితానికి అర్థం ఏమిటి?” అనే ప్రశ్నలకు సమాధానం వెతికే దశ టీనేజ్ అన్నారు.
ఆలోచించకుండా భావోద్వేగాల మీదనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రేమ పేరుతో వచ్చే మానసిక సమస్యలు స్ట్రెస్ & ఆందోళన: బ్రేకప్ లేదా తిరస్కరణ కలిగితే డిప్రెషన్‌కు దారితీస్తుందని తెలిపారు. చదువుల మీద ఫోకస్ తగ్గి భవిష్యత్తు పై నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందన్నారు.అతను/ఆమె లేకుండా నేను జీవించలేను” అనే భావనతో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందన్నారు. స్నేహితులు, కుటుంబాన్ని దూరం పెట్టి ఒకరిపైనే దృష్టి పెట్టడంతో నిన్ను నీవు మరచిపోతావని చెప్పారు.సరైన మార్గంలో ఉంటే టీనేజ్ లవ్ కేరింగ్ నేర్పిస్తుంది న్నారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి, సెల్ఫ్ అవగాహన పెరుగుతుందన్నారు.
సెల్ఫ్-అవేర్నెస్ పెంచుకవాలని సూచించారు. ప్రేమ అనేది చదువులు, కుటుంబం, కెరీర్‌కి వ్యతిరేకం కాదని అన్నారు. లవ్ సమస్యలుంటే సైకలాజిస్టు లేదా నమ్మకమైన పెద్దల నుండి కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిదన్నారు.టీనేజ్ ప్రేమను పూర్తిగా తప్పు అనడం కరెక్ట్ కాదని , భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటే అది మానసిక ఆరోగ్యం, భవిష్యత్తు రెండింటినీ నాశనం చేస్తుందని చెప్పారు.
ప్రేమ అనేది జీవితంలోని ఒక భాగం మాత్రమే, జీవితమే కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 8,9,10 విద్యార్థులు, హెచ్.ఎం. కె.వాణీశ్రీ , లయన్స్ క్లబ్ సభ్యులు జయశ్రీ , జి.లక్ష్మి టిచర్లు పాల్గొన్నారు. చక్కని ప్రశ్నలు అడిగిన విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకోవాలో విద్యార్థులతో టెక్నిక్స్ ను ప్రాక్టీస్ చేయించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad