Friday, March 20, 2026
E-PAPER
Homeసినిమా'లవ్‌వాలా' షూటింగ్‌ షురూ

‘లవ్‌వాలా’ షూటింగ్‌ షురూ

- Advertisement -

రవీంద్ర తేజ్‌ హీరోగా ఎస్‌విఏఎన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, శుభకరి ఇన్‌ఫ్రా అండ్‌ మీడియా బ్యానర్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్‌వాలా’. డైరెక్టర్స్‌ కొరటాల శివ, బుచ్చిబాబు సానా వద్ద అసోసియేట్‌గా పని చేసిన రంజిత్‌ కుమార్‌ దేశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అరియా మోడీ హీరోయిన్‌గా నటిస్తోంది. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్‌ కొరటాల శివ ముహుర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. మరో డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. కొరటాల శివ, బుచ్చిబాబు సానా మేకర్స్‌కు స్క్రిప్ట్‌ అందజేశారు.

పలువురు సినీ ప్రముఖులు, మూవీ యూనిట్‌ పాల్గొన్న ఈ వేడుక ఘనంగా జరిగింది. నిర్మాత సురేష్‌ వర్మ మాట్లాడుతూ,’సినిమా అంటే ప్యాషన్‌తో నిర్మాణం రంగంలోకి అడుగుపెడుతున్నాం. రంజిత్‌ చెప్పిన కథ మాకు చాలా నచ్చింది. ఇది చాలా మంచి లవ్‌ స్టోరీ’ అని తెలిపారు. ‘త్వరలోనే ఫస్ట్‌ గ్లింప్స్‌తో అందరినీ అలరిస్తాం’ అని హీరో రవీంద్ర తేజ్‌ చెప్పారు. డైరెక్టర్‌ రంజిత్‌ కుమార్‌ దేశెట్టి మాట్లాడుతూ,’ఇదొక రూరల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే మంచి లవ్‌ స్టోరీ’ అని అన్నారు. రాజ్‌ అర్జున్‌, మణి చందన, కమల్‌, నవీన్‌ నేని, నాగ మహేష్‌, రష్మీ గౌతమ్‌ తదితరులు ఇతర ముఖ్య తారాగణం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -