- Advertisement -
– తండ్రులకు అవగాహన
– ఐసీడీఎస్ సూపర్వైజర్ సౌజన్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
పోషణ మాసంలో భాగంగా మండలంలోని వడ్డి రంగాపురం లో శనివారం తక్కువ వ్యయంతో పోషకాహారం తయారీ పై తండ్రులకు అవగాహన కల్పించినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ నాదెళ్ల సౌజన్య తెలిపారు. అనుబంధ పోషకాహారం ఎప్పుడూ మొదలు పెట్టాలి, ఎలా ఇవ్వాలి అని అంశం వివరించారు. అనంతరం వారితో తక్కువ ఖర్చుతో చేసే వంటకాలను తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు అంజలి సరోజినీ,ఏఎన్ఎం స్వరూప, గ్రామస్తులు పిల్లల తల్లులు పాల్గొన్నారు.
- Advertisement -