డాక్టర్ నగరి బీరప్ప
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిమ్స్‌కు 4 విభాగాల్లో ఎం.సిహెచ్, డీఎం సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతించింది. ఈ మేరకు శనివారం నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది తెలంగాణలో ప్రభుత్వ వైద్య సంస్థలకు లభించిన తొలి ఘనతగా ఆయన అభివర్ణించారు. మాస్టర్ ఆఫ్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ, డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ కోర్సులకు అనుమతి లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 16 సీట్లు మంజూరు కాగా వాటిలో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ – ఎం.సిహెచ్ 4 సీట్లు, వాస్క్యులర్ సర్జరీ -ఎం.సిహెచ్ 4 సీట్లు సర్జికల్ ఆంకాలజీ -ఎం.సిహెచ్ 4 సీట్లు, ఆంకో పాథాలజీ – డీఎం 4 సీట్లు ఉన్నట్టు తెలిపారు.
4 విభాగాల్లో ఎం.సీహెచ్, డీఎం సీట్లకు అనుమతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



