Saturday, February 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలురూ.400 కోట్లతో 'మా వందే'

రూ.400 కోట్లతో ‘మా వందే’

- Advertisement -

‘మా వందే’ టైటిల్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ తెరకెక్కుతున్న విషయం విదితమే. సిల్వర్‌ కాస్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ప్రొడ్యూసర్‌ వీర్‌ రెడ్డి.ఎం. నిర్మిస్తున్నారు. నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో ఉన్ని ముకుందన్‌ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్‌. సీహెచ్‌. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్‌ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఈ మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణలో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

ఈ చిత్ర బృందం నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం కాశ్మీర్‌ వెళ్తున్నారు. ఈ సినిమాను సిల్వర్‌ కాస్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ స్టోరీ డ్రివెన్‌ మూవీని ప్రపంచంలో తొలిసారిగా తొలిసారి ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఆక్వా మ్యాన్‌లో హీరోగా నటించిన జేసన్‌ మమొవాను ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. రవీనా టాండన్‌, జగపతి బాబు, శరత్‌ కుమార్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కింగ్‌ సోలొమన్‌ , ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌, ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌, డీవోపీ కె.కె. సెంథిల్‌ కుమార్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి బస్రుర్‌ వంటి టాప్‌ మోస్ట్‌ టెక్నీషియన్స్‌ ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -