Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమాచర్ల పున్నమ్మ అవయవాలు దానం

మాచర్ల పున్నమ్మ అవయవాలు దానం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం నోముల గ్రామానికి చెందిన మాచర్ల పున్నమ్మ (47) అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. మాచర్ల వెంకన్న భార్య పున్నమ్మ గృహిణి. ఆగస్టు 26న సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆటో ముందుభాగంలో కూర్చున్న ఆమె రన్నింగ్‌లో ఉండగా నోముల వద్ద అకస్మాత్తుగా పడిపోయింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్సనందించినప్పటికీ సెప్టెంబర్‌ 2న ఉదయం 11.34 గంటలకు ఆమె బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు వైద్యులు ప్రకటించారు. ఆమె మరణించిన తర్వాత ఆమె అవయవాలు ఏడుగురు అత్యవసర రోగులకు ఉపయోగపడేలా ఆమె కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవన్‌దాన్‌ పున్నమ్మ నుంచి మూత్రపిండాలు, కార్నియాలు, కాలేయం, ఒక ఊపిరితిత్తులు, గుండెను సేకరించారు. పున్నమ్మ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఆదర్శంగా నిలుస్తుందనీ, పలువురికి స్ఫూర్తినిస్తుందని జీవన్‌దాన్‌ కార్యక్రమం నోడల్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో 135 మంది అవయవాలు దానం చేయగా, పున్నమ్మ అవయవదానంతో అవయవదాతల సంఖ్య 136కు చేరినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad