– డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్ వెల్లడి
– వారిలో అగ్రనాయకులు కేశవరావు.. 14 మంది మహిళలు
– మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ : విశ్లేషకులు
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా, అబుజ్ మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 14 మంది మహిళా మావోయిస్టులతో సహా మొత్తం 27 మంది మృతదేహాలను నారాయణపూర్ జిల్లా పోలీస్ యంత్రాంగం గుర్తించినట్టు డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ తెలిపారు. అటవీ ప్రాంతంలో సుమారు 50 గంటలపాటు హౌరా హౌరీగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాబలాలు భారీగా గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులు ఘటనా స్థలం వద్ద 27 మృతదేహాలతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని గురువారం నారాయణపూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 27 మందిలో ఇద్దరు తెలుగువారిని పోలీసులు గుర్తించారు. కేంద్ర కమిటీ సెక్రెటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా జీయన్నపేటకు చెందినట్టు గుర్తించారు. ఆయనపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 1.5 కోట్ల రివార్డు ఉంది. మరో తెలుగు మావోయిస్టు నేత, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ వెంకట్ నాగేశ్వరరావు అలియాస్ యాసన్న అలియాస్ జంగు నవీన్.. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈయన పైనా రూ.25 లక్షల రివార్డ్ ఉంది. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో పీఎల్‌జీఏ నెంబర్ 7 కంపెనీకి చెందిన మావోయిస్టులు భారీగా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ అని పలువురు విశ్లేషిస్తున్నారు.
మాడ్ ఎన్‌కౌంటర్ మృతుల గుర్తింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES