Sunday, March 1, 2026
E-PAPER
Homeసినిమాసరికొత్త కాన్సెప్ట్‌తో 'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌'

సరికొత్త కాన్సెప్ట్‌తో ‘మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’

- Advertisement -

అఫీషియల్‌ ప్రీమియర్‌కి ముందే జియో హాట్‌స్టార్‌ రూపొందిస్తున్న కొత్త రియాలిటీ షో ‘మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌.
ఇప్పటికే ఈ షో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. షో చిత్రీకరణ జరుగుతున్న లొకేషన్‌ ‘లవ్‌ మాన్షన్‌’ లోపలి ఎక్స్‌క్లూజివ్‌ చిత్రాలు బయటికి వచ్చాయి. ఈ విశాలమైన మాన్షన్‌లో ప్రస్తుతం 10 మంది సెలబ్రిటీ జంటలు 70 రోజుల ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రేమ, నమ్మకం, సహనం, భాగస్వామ్యాన్ని 24/7 కెమెరాల పర్యవేక్షణలో పరీక్షించే విధంగా ఈ లవ్‌ మాన్షన్‌ను డిజైన్‌ చేశారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి, హీరోయిన్స్‌ రాధ, లయ ఈ షోకి జ్యూరీగా ఉండటం మరింత ప్రత్యేకతని తీసుకొచ్చింది.
యాంకర్‌ శ్రీముఖి హోస్ట్‌ చేస్తున్నారు. తాజగా మీడియా ప్రతినిధులకు ఈ షోకి సంబధించిన స్పెషల్‌ ప్రోమోని ప్రదర్శించారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ,’ఈ షో ఐడియా, కాన్సెప్ట్‌ నాకు చాలా నచ్చింది. ఈ మాన్షన్‌లో పోటీ ప్రేమలో కాదు… ఉన్న పది మంది కపుల్స్‌లో ఎవరు స్పోర్టివ్‌గా ముందుకు వెళ్తారనేదే ముఖ్యం. షో అద్భుతంగా జరుగుతోంది. మనం లైఫ్‌ స్టోరీస్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతాం. అలాంటి అద్భుతమైన పది కపుల్స్‌ స్టోరీస్‌ ఇందులో ఉన్నాయి. ఇలాంటి షోకు జడ్జ్‌గా చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌. వాళ్ల లైఫ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ వినడం, మనకు తెలిసిన సలహాలు చెప్పడం ఒక కొత్త అనుభూతి. తెలుగులో ఇలాంటి షో ఫస్ట్‌ టైమ్‌. శ్రీముఖి హోస్ట్‌గా ఉంటారు. అలాగే నాతో పాటు జడ్జ్‌గా డ్రీమ్‌ గర్ల్‌ రాధ ఉండటం ఆనందంగా ఉంది. అలాగే మరో జడ్జ్‌ లయ చాలా స్పోర్టివ్‌గా వారి లైఫ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ షేర్‌ చేస్తున్నారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -