రేణుక నరసయ్య సర్పంచ్
నవతెలంగాణ- ఆలేరు రూరల్
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహకారంతో ఆలేరు మండలంలోని అన్ని గ్రామాల కంటే మందనపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచుతారని మందనపల్లి సర్పంచ్ సిరిమర్తి రేణుక నరసయ్య అన్నారు. నూతనంగా సర్పంచ్ గా ప్రమాణ శ్రీకారం చేసిన సందర్భంగా మంగళవారం నాడు నవతెలంగాణతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్ కల్యాణ లక్ష్మి లాంటి పథకాలను ఎమ్మెల్యే సహకారంతో అందరికీ వచ్చే విధంగా చూస్తానని అన్నారు. గ్రామంలో వీధిలైట్లు పారిశుద్ధం మురికి కాల్వల నిర్వహణ తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూస్తానన్నారు. మందన పల్లి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ చేతనైనంత సహాయం చేస్తానన్నారు. ఉప సర్పంచ్ పద్మశ్రీ శశిరేఖ సుదర్శన్ వార్డ్ మెంబర్లు శ్రీలత తమ్ముడి అంజయ్య సుంచు ఇందిరా కడకంచి రాజు ఊట్కూరి అంజయ్య సాయికుమార్ గుండు బాలమణి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన సంఘాలు సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకులతో కలిసిమెలిసి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు.
ఎమ్మెల్యే సహకారంతో మందనపల్లి అభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



