Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నేలపట్లలో ఘనంగా మద్దెలమ్మ పండుగ..

నేలపట్లలో ఘనంగా మద్దెలమ్మ పండుగ..

- Advertisement -

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కుల బాంధవులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆదివారం నేలపట్ల గ్రామంలో పద్మశాలి కుల సంఘం పూర్వికులు 70 సంవత్సరాల క్రితం సుమారు మూడు ఎకరాల భూమిని కేటాయించి పద్మశాలి కులదైవమైన శ్రీశ్రీ భద్రావతి మద్దెలమ్మ దేవాలయం నిర్మించారు.మద్దెలమ్మకు పెద్ద పండుగను ఘనంగా నిర్వహించారు.స్థానిక మాజీ ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ నేత ఆధ్వర్యంలో భద్రావతి దేవాలయం వద్ద ఎంపీటీసీ నిధులు 2,00,000 రూపాయలతో వాటర్ ట్యాంక్ ను నిర్మించారు.పద్మశాలి కుల బంధువుల అవసరాల నిమిత్తం మినీ ఫంక్షన్ హాల్,బాత్రూంలను,దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ జాలి గేటును నిర్మించారు. పద్మశాలి కుటుంబాల దాతల సహాయంతో సుమారు పది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకొని ఆదివారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి నిజాం కాలేజీ ప్రొఫెసర్ తడక యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతు పద్మశాలి కుల బాంధవుల ఐక్యతని వివరిస్తూ భవిష్యత్తులో రాజకీయంగా ప్రముఖ పాత్ర పోషించాలని పద్మశాలిలకు పిలుపునిచ్చారు.ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలలో ఎదగాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణాలకు సహకరించిన దాతలను శాలువా మెమెంటులతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘం అధ్యక్షులు తడక శ్రీనివాసు కార్యదర్శి గుర్రం వెంకటేశ్వర్లు స్థానిక మాజీ ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ నేత మాజీ సర్పంచ్ తడక రామాంజనేయులు మాజీ ఉపసర్పంచులు తడక వెంకటేశం గుర్రం వెంకటేశం పద్మశాలి జిల్లా కులసంఘం ఉపాధ్యక్షులు కడెం రాములు డిసిసిబి మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ తడక కోటేశ్వర్ చండూరు సత్యం పిల్లలమర్రి కిరణ్,మదన్,గంజి లింగేష్,గుర్రం శ్రీరాములు, గుర్రం కృష్ణయ్య,గుర్రం నరసింహ,గుర్రం శ్రీనివాసులు,తడక చంద్రశేఖర్,గుర్రం గోవర్ధన్,ప్రమోద్ కుమార్ భక్తులు పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad