Wednesday, February 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా మద్దికాయల అశోక్‌ ఓంకార్‌

ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా మద్దికాయల అశోక్‌ ఓంకార్‌

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్‌ బ్యూరో
ఎంసీపీఐ(యూ) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మద్దికాయల అశోక్‌కుమార్‌ ఓంకార్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు కలిగి రెండు కేంద్ర కమిటీలు ఐక్యం కావడానికి 2018 నుంచి పలు చర్చలు జరిగాయని తెలిపారు. అందులో భాగంగానే ఈ నెల 23, 24 తేదీల్లో రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో కిరణ్‌ జిత్‌ సింగ్‌ షేఖాన్‌, మర్రెడ్డి వెంకటరెడ్డి, గాదగోని రవి, ప్రేమ్‌ సింగ్‌ భంగ్‌ అధ్యక్షతన జాతీయ యూనిట్‌ కన్వెన్షన్‌ జరిగిందని పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ , బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్తాన్‌, చండీగఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన 220 మంది ప్రతినిధులు కన్వెన్షన్‌కు హాజరయ్యారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -