Monday, February 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రశాంతంగా ముగిసిన మద్దికుంట ఆలయ ఉత్సవాలు 

ప్రశాంతంగా ముగిసిన మద్దికుంట ఆలయ ఉత్సవాలు 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని మద్దికుంట లో వెలసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు మూడవరోజు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ఉదయం దక్షయజ్ఞం(అగ్నిగుండాలు) నిర్వహించారు. ఆదివారం రాత్రి జాగారం చేసిన భక్తుల సౌకర్యార్థం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, ఎల్ఈడి టీవీలతో భక్తి కార్యక్రమాలను నిర్వహించారు.

భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు, సిఐ రమణ ఆధ్వర్యంలో ఎస్సైలు రాజశేఖర్, అనిల్, కొండ విజయ్, ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి, ఆలయ ప్రధాన పూజారి ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి, ఉపాధ్యక్షులు లింగమాచారి, ప్రధాన కార్యదర్శి కామెల్ల నరేందర్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -